నేనెలా జర్నలిస్టునయ్యాను ?
అవును... నేనెలా జర్నలిస్ట్ నయ్యానో ఆలోచిస్తే ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి నాకు అప్పటివరకు journalism అనే profession ఒకటి ఉంటుందని తెలియదు. టీచర్ నో, డాక్టర్ నో అవ్వాలనుకునేదాన్ని. అలాంటిది ఇంకా చదువు పూర్తి కాక ముందే ఈ వృత్తి తో పరిచయమయింది. టీచర్గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటు గా డిగ్రీ చదువు కుంటున్నరోజులవి. మా బాబాయి ఒకరు చిన్న పత్రిక మొదలెట్టారు. దాని పేరు జాతి రత్నం. ఆ పేరుతో ఒక కాలం స్టార్ట్ చేసి గాంధీ, నెహ్రు తదితర జాతి రత్నాల గురించి రాసేవారు. ఓ సారి కింద నా పేరు పెట్టి తెచ్చి చూపించారు. అచ్చు లో మన పేరు ఎంత అందంగా కన్పిస్తుందో మీడియా మిత్రులకి చెప్పనక్కర లేదు కదా. నేను అలాగే పడిపోయాను. ఆ పడడం ఏకంగా జీవిత కాలం పాటు లేవనీయకుండా చేస్తుందని అసలే మాత్రం ఊహించలేదు సుమా. ఢిల్లీ లోని హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ journalism నుంచి డిప్లొమా చేశాను. ఆంధ్రభూమి కి అప్లై చేస్తే వార్తలు పంపమని లెటర్ వచ్చింది. ఆ ఉత్తరం రాసి పుణ్యం కట్టు కున్నది ఆర్వీ రామారావు గారు. అక్కడ రెసిడెంట్ ఎడిటర్ గ ఉండేవారు. అలా ఓ మూడేళ్లపాటు అరవ చాకిరీ... అటు టీచర్ ఉద్యోగం... ఇటు వార్తల సేకరణ. మరో పక్క చదువు. యూజీ, పీజీ అయిపోయాయి. journalism తాలూకు కిక్ మాత్రం తగ్గలా. అసలు విషయం చెప్పనా ? మూడేళ్ళు పని చేస్తే సదరు పత్రిక నుంచి నాకు ఒక్క రూపాయి రాలేదంటే నమ్ముతారా? డెస్క్, ఎడిటర్, MD... అందరిని కలిసాను. నో use. అయినా ఎందుకు పని చేశానంటే... చెప్పానుగా... కిక్!
ఆ కిక్ ఇచ్చిన వార్తలేమిటో.. అందుకు నాకు సహకరించిన దెవరో మళ్ళీ చెప్తా.